calender_icon.png 18 September, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

17-09-2025 10:32:59 PM

హనుమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను హనుమకొండ జిల్లాలో బుధవారం ఘనంగా నిర్వహించారు. హనుమకొండ అదాలత్ కూడలి లో తెలంగాణ అమరవీరులకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, తదితరులు అమరవీరుల స్థూపం వద్ద పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద నుండి హనుమకొండ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా పాలన వేడుకలకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ అమరవీరులు, ప్రజా పాలన, జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు గురించి ప్రసంగించారు.

కాగా అంతకుముందు కలెక్టరేట్ కు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి  జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పుష్ప గుచ్ఛం అందించగా కలెక్టరేట్ వద్ద పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వర్దన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి,  కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎండీ. అజీజ్ ఖాన్, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

ఎన్ఐటీ వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఘన స్వాగతం

వరంగల్ ఎన్ఐటీ కి చేరుకున్న రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పుష్ప గుచ్చాలు, మొక్కలు అందించి ఘన స్వాగతం పలికారు.