calender_icon.png 4 October, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తిశ్రద్ధలతో దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర

04-10-2025 12:00:00 AM

మద్నూర్, అక్టోబర్ 3 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నవరాత్రులు పూజలందుకున్న దుర్గామాత నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామం లో శ్రీ భ్రమరాంబిక శక్తి స్వరూపిణి దేవి మండల కమిటీ ఆధ్వర్యంలో దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు.

శుక్రవారం నిమజ్జన శోభాయాత్ర జరిగింది.యాత్రలో భాగంగా మహిళలు, యువకులు, చిన్నారులు ఉత్సాహంగా నృత్యాలు కోలాటాలు చేశారు. మహిళలు మంగళహారతులతో అమ్మవారి ముందు నడిచారు. పెద్ద సంఖ్యలో భక్తిశ్రద్ధలతో భవాని దీక్షపరుల మధ్యన అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు.