04-10-2025 12:00:00 AM
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
కామారెడ్డి, అక్టోబర్ 3 (విజయక్రాంతి): దేశ రక్షణ చేయడంతో పాటు రక్తదానం చేయడం అభినందనీయమని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన బాణాల మహేందర్ రెడ్డి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో హెడ్ కానిస్టేబుల్ గా 23 సంవత్సరాలుగా విధులను నిర్వహిస్తూ ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ మానవత్వాన్ని చాటుతున్నాడని తెలిపారు.
దేశ రక్షణ కోసం ఒకవైపు విధులను నిర్వహిస్తూ, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే మంచి ఉద్దేశంతో ఐదవ సారి రక్తదానం చేసినందుకు బాణా ల మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందని అన్నారు. దేశం కోసం పనిచేస్తూనే మానవత్వాన్ని చాటుతున్నడం అభినందనీయమని అన్నారు. కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీల తరఫున అభినందనలు తెలిపారు.