calender_icon.png 22 September, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ కాళేశ్వర ఆలయంలో ఘనంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు

22-09-2025 05:26:18 PM

మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో దుర్గా నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం మొదటి రోజున శుభానంద దేవి, సరస్వతి అమ్మవార్లు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ప్రధానార్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాల్లో పూజలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. ఈ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ పాలెపు చంద్రశేఖర్ శర్మ దేవి వైభవ ప్రవచనం చేయడం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దుర్గాదేవి వైభవా ప్రవచనం  వినడం ద్వారా భక్తి తన్యాత్మం పొందాలని ఈవో మహేష్ తెలిపారు.