calender_icon.png 27 December, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్తీ దర్శన్‌లో స్థానిక సమస్యలపై కార్పొరేటర్ దృష్టి

27-12-2025 03:59:24 PM

రామచంద్రపురం: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ మిగ్ కాలనీ (ఎఫ్ పార్క్ సమీపంలో)లో బస్తీ దర్శన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి  కాలనీలో పర్యటించి, స్థానికుల నుంచి రోడ్లు, డ్రైనేజ్, పారిశుధ్య సమస్యలపై వినతులు స్వీకరించారు. ప్రజల ఫిర్యాదులకు తక్షణమే స్పందించిన కార్పొరేటర్ , కాలనీలో ఉన్న నీటి డ్రైన్‌లో డీసిల్టింగ్ పనులు వెంటనే చేపట్టాలని ఇంజినీరింగ్ విభాగం వర్క్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌కు ఆదేశించారు.

అలాగే రోడ్డు అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్నాయని, వాటికి త్వరితగతిన మంజూరు తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి  మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రథమ కర్తవ్యమని, కాలనీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.