27-12-2025 04:02:44 PM
వాంకిడి,(విజయక్రాంతి): మండలంలోని బంబార గ్రామంలో శనివారం సర్పంచ్ బెండారె కృష్ణాజి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మురుగు కాలువలు శుభ్రం చేసి క్లోరినేషన్ నిర్వహించారు. వాడల్లోని చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించారు. పంచాయతీ కార్యదర్శి పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సఫాయి కార్మికులు ఉన్నారు.