27-12-2025 03:55:24 PM
నిర్మల్,(విజయక్రాంతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శాఖ ఆధ్వర్యంలో జనవరి 3~5 జరిగే రాష్ట్ర మహాసభల పోస్టర్ ను ఎస్ఆర్ గర్ల్స్(SR GIRLS) జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో ఏబీవీపీ నిర్మల్ జిల్లా కన్వీనర్ మూడపల్లి దినేష్ మాట్లాడుతూ... శంషాబాద్ లో జరగబోయే 44వ రాష్ట్ర మహాసభలను విద్యార్థులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. ఈ మహాసభలలో రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొంటున్నారని, జనవరి 3-5 తేదీలలో శంషాబాద్ లో జరుగుతుంది. మూడు రోజులపాటు అనేక విషయాలపై చర్చించడం జరుగుతుందన్నారు.