calender_icon.png 15 January, 2026 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగ వేళ ఫ్రోజెన్ ఫుడ్‌కు హైదరాబాదీల ఓటు

15-01-2026 02:05:52 AM

గోద్రెజ్ యమ్మీజ్ స్టెమ్ 2.0 నివేదిక

పంజాగుట్ట, జనవరి 14 (విజయక్రాంతి): పండుగ వేళ హైదరాబాదీలు ఫ్రోజెన్ ఫుడ్‌కు ఎక్కువగా ఓటు వేస్తున్నారని గోద్రెజ్ యమ్మీజ్ స్టెమ్ 2.0 నివేదికలో వెల్లడైంది. సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో 41 శాతం మంది ఫ్రోజన్ స్నాక్స్ ను ఎక్కువగా తింటున్నారని తేలింది.ఈ విషయమై గోద్రెజ్ యమ్మీజ్ ప్రతినిధులు మాట్లాడు తూ సంక్రాంతి పండుగ వచ్చిందంటే చిరు తిండ్లకు బాగా డిమాండ్ ఉంటుందన్నారు.

ప్రతి ఇల్లు సందడిగా మారుతుందన్నారు. ఇంటి టెర్రస్ లు గాలి పటాలకు పోటీ కేంద్రాలుగా మారుతాయన్నారు. ఇటువంటి సందడిలో ఎక్కువ మంది వేగంగా,రుచికరంగా అయ్యే ఆహారాన్ని ఇష్టపడుతున్నారన్నారు. అందుకోసం ఫ్రోజెన్ ఫుడ్ ఎంపిక చేసుకోవడం నానాటికీ పెరుగుతోందన్నారు. వాటి వల్ల ఎక్కువ సేపు వంటకు సమయం పట్టకపోవడం కూడా ఒక కారణంగా పేర్కొన్నారు. వెంటనే తినగలిగే స్నాక్స్‌లో ఫ్రొజెన్ ఫుడ్స్ తో పాటు మిఠాయిలు, మినీ మీల్స్ వంటి స్నాక్స్ సంక్రాంతి వేడుకల్లో చోటును ఆక్రమించుకున్నా యని వివరించారు. భోగి నుంచి ముక్కనుమ వరకు చిరుతిళ్లదే హవా అని ప్రకటించారు.