calender_icon.png 4 October, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లెందులో ఘనంగా దసరా వేడుకలు

04-10-2025 12:59:08 AM

పాల్గొన్న మంత్రి పొంగులేటి 

ఇల్లెందు, అక్టోబర్ 3, (విజయక్రాంతి):ఇల్లందులో దసరా ఉత్సవాల సందర్భంగా గురువారం రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ సంస్థ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఇల్లెందులో దసరా ఉత్సవాల వేడుకలు ఎంతో ఘ నంగా నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కోరం కనకయ్యను అభినందించారు.

దసరా ఉత్సవాల వేల జబర్దస్త్ టీం సభ్యులు ప్రజలను ఎంతగానో ఆటపాటలతో ఆకట్టుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. స్థానిక సింగరేణి పాఠశాలలో ఏ ర్పాటు చేసిన వేడుకలు సందర్భంగా ప్రజలు వేలాదిగా తరలివచ్చి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అర్ధరాత్రి వరకు ఆటా పాటా నిర్వహించి ఎమ్మెల్యే కోరం కనకయ్య రావణాసుర వద్ద కా ర్యక్రమం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, సిఐ తాటిపాముల సురేష్ ఆధ్వర్యంలో బందోబస్త్ నిర్వహించారు.