calender_icon.png 4 October, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫలించిన ఎంపీ రఘురాం రెడ్డి కృషి

04-10-2025 12:58:04 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరు

కొత్తగూడెం, అక్టోబర్ 3, ( విజయక్రాంతి ):ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ్ సహాయం రఘురామిరెడ్డి కృషి ఫలితంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్రీయ విద్యాలయం మంజూర అయింది.ఏజెన్సీ ప్రాంతమైన జిల్లాలో, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ఆవశ్యకత ఎంతో ఉందని ఆయన పార్లమెంట్ లో చర్చించి, మంజూరు చేయాల్సిందిగా గతంలో కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. తాజాగా కేంద్రం స్పందించి జిల్లాకు కేంద్రీయ వి ద్యాల యాన్ని మంజూరు చేశారు.

కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి నాలుగు కేటాయించగా అందులో ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు దక్కింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలప్పుడు ఆదివాసీ బిడ్డల విద్యాభివృద్ధి కోసం, కేంద్రం చొరవ చూపాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు చేసిన అ భ్యర్థనలు ఫలించాయి. ఎంపీ రఘురాంరెడ్డి చూపిన చొరవ, ప్రత్యేక శ్రద్ధతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరవడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ నేతలు పలువురు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.