04-10-2025 01:00:15 AM
రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
పాల్వంచ మండలం లో కాంగ్రెస్ నాయకుల విసృత పర్యటన
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 3, (విజయక్రాంతి):స్థానిక సంస్థలకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డీ సీ ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాస రావు అన్నారు. పాల్వంచ మండలం పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు విసృతంగా పర్యటించారు.
మండలం పరిధిలోని దంతెలబోర, ఎస్సీకాలనీ, సంగెం, నారాయణరావు పేట, నాగారం, రంగాపురం, నాగారం కాలనీ, జగన్నాథపురం, తోగ్గుడెం, తదితర గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలొ అధికారం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదన్నారు. గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎల్లప్పుడు ప్రజలకు అం దుబాటులో ఉంటున్నారని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరా రు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బరిపటి వాసుదేవరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాలె జానకి రెడ్డి,మాజీ జడ్పిటిసి యర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, ఆర్టిఏ సభ్యులు బాదర్ల జోషి, కాంగ్రెస్ నాయకులు ఎస్ వి ఆర్ కె ఆచార్యులు, ఉండేటి శాంతి వర్ధన్, ధర్మసోత్ ఉపేందర్ నాయక్, డిష్ నాగేశ్వర రావు, బండి నాగరాజు,తోడోజు బ్రహ్మచారి,ధర్మసోత్ రాము లు,బానోత్ బాలాజీ, మెంటం రాము,తెల్లం మల్లేష్, మల్లయ్య,కొర్రయ్య,కోలేటి రాంబాబు,మ క్బూల్,శ్రీలత రెడ్డి,కన్నయ్య,గంగుల వెంకటేశ్వర్ రెడ్డి, మంచ్య, పర్వ సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.