calender_icon.png 20 September, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిడ్జిలు నిర్మించాలని ఎంపీ డీకే అరుణకు వినతి

20-09-2025 07:13:00 PM

రాజాపూర్: మండల కేంద్రంలో ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని శనివారం మండల బిజెపి నాయకులు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణను కలసి వినతిపత్రం అందజేశారు. రాజాపూర్ మండల కేంద్రం ముఖ్య కూడలిలో ఒక ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, మండల కేంద్రం నుండి తిరుమలాపూర్ మీదుగా ముంబై వెళ్లే డబల్ రోడ్డు వద్ద మరో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించడం వల్ల భారీ వాహనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్తాయని తెలిపారు.

ఒకటే ఫ్లైఓవర్ నిర్మించడం వల్ల మండల కేంద్రంలో వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. జాతీయ రహదారుల మంత్రితో చర్చించి రాజాపూర్ లో రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఆనంద్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు వనపర్తి నర్సింలు, సీనియర్ నాయకులు రామకృష్ణ, శేఖర్, రాజు, గంగాధర్ గౌడ్, ప్రవీణ్ కుమార్, అరుణ్ రెడ్డి, మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.