calender_icon.png 4 August, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రాంతి విద్యాలయంలో ముందస్తు స్నేహితుల దినోత్సవ వేడుకలు

03-08-2025 12:58:56 AM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలంలోని  క్రాంతి విద్యాలయంలో ఆగస్టు 3 తేదీ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సొంతంగా ఫ్రెండ్షిప్ బ్యాండ్లు తయారు చేసుకుని వచ్చి విద్యార్థులు ఒకరికి ఒకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సోమరౌతు. శ్రీనివాసరావు విద్యార్థులకు ఉపాధ్యాయులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సమత శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి స్నేహితుల అనుబంధం మనిషి వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో స్నేహబంధాలను మరింత పటిష్టం చేయడం, ఒకరినొకరు గౌరవించడం, మైత్రి భావన పెంపొందించడం లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఐ. హేమశిల్ప ,అధ్యాపక అధ్యాపకేతర బృందంతో పాటు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.