calender_icon.png 4 August, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో మూడు నెలలు పొడిగింపు!

03-08-2025 12:57:46 AM

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాం తి): తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీకాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందని ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శిగా బాధ్యతలు చేపట్టి మూడు నెలలే కావొస్తుంది. అయితే రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు కనీసం ఆరు నెలలు కూడా పని చేయలేదు.

కాబట్టి మరో మూడు నెలలపాటు తన పదవీకాలాన్ని పొడగిస్తారని ఆయన భావిస్తున్నారని, అందులో భాగంగానే డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ)కి కూడా అర్జీ పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించాలంటే ఒక స్పెషల్ సీఎస్ పేరును రెండు పర్యాయాలుగా డీవోపీటీకి పంపవచ్చని తెలుస్తోంది. అయితే రామకృష్ణారావు సేవ లు రాష్ర్ట ప్రభుత్వం వాడుకోవాలనుకుంటే మూడు నెలల కోసం డీవోపీటీకి పంపిస్తుంది. లేదంటే మరో ముగ్గురు వ్యక్తుల పేర్లు కేంద్రానికి సిఫార్సు చేస్తుంది. దీనికి సంబంధించిన కసరత్తును ప్రభుత్వం ప్రారంభించినట్టు తెలుస్తోంది. సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడగించాలని సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన ట్టు సమాచారం. 

కమిషన్ నివేదికపైనే ఆధారం... 

కాళేశ్వరం ప్రాజెక్టులోని అవకతవకలు, ని ర్మాణ లోపాలు, బరాజ్‌ల కుంగుబాటుపై రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన విచారణ పూర్తి చేసి నివేదికను అందించింది. ఈ నివేదికలో ఏముం దనేది అందరిలో ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వ పె ద్దలతోపాటు పలువురు ఉన్నతాధికారుల ప్ర మేయం కూడా ఉంది. ఈ క్రమంలోనే కమిషన్ ఆయా అధికారులను బహిరంగ విచార ణ కూడా చేసింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ద్వారా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుం టుందోనని అధికార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

అయితే కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయని, ఇ ష్టానుసారంగా నిధులు విడుదల చేశారని కమిషన్ గుర్తించింది. గడిచిన పదేళ్లుగా ఆర్థి క శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు కొనసాగారు. కాళేశ్వ రం కమి షన్ బహిరంగ విచారణను కూడా సీఎస్ రా మకృష్ణరావు ఎదుర్కొన్నారు. త్వరలో నివేది క బహిర్గతం అయితే రామకృష్ణారావు ని బంధనలు ఉల్లంఘించిన విషయం తేటతె ల్లం అవుతుందని అధికార వర్గాల్లో జోరు గా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సీఎస్‌గా రామకృష్ణారావు కొనసాగింపు సాధ్య మవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. దీంతో మరో మూడు నెలలు సీఎస్‌గా రామకృష్ణారావును కొనసాగించాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కీలకంగా మారింది. 

రామకృష్ణారావు కాకపోతే... 

సీఎస్‌గా రామకృష్ణారావు పదవీకాలం పొడగింపునకు సాధ్యం కాకపోతే తర్వాత ఎవరిని సీఎస్‌గా నియమిస్తారని చర్చ జరుగుతుంది. రాష్ర్ట ఏఐఎస్ క్యాడర్ అధికారులలో 1990, 1991, 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు సీఎస్ రేస్‌లో ఉన్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన శశాంక్ గోయల్, 1991 బ్యాచ్‌కు చెందిన అరవింద్ కుమార్, 1992 బ్యాచ్‌కు అధికారులలో సంజయ్ జాజు, జయేశ్ రంజన్, వికాస్‌రాజ్‌లు ఉన్నారు.

సంజయ్ జాజు ప్రస్తుతం కేంద్ర సర్వీసులో కొనసాగుతున్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన శశాంక్ గోయల్ ఢిల్లీ తెలంగాణ భవన్ స్పెషల్ సీఎస్‌గా కొనసాగుతున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన అరవింద్ కుమార్ ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఇటీవల మరో కేసు కూడా నమోదు అయ్యింది. రాష్ర్ట ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో జయేష్ రంజన్, వికాస్ రాజ్ కొనసాగుతున్నారు. మరి వీరిలో ఎవరికి సీఎస్‌గా అవకాశం దొరుకుతుందో అని చర్చ జరుగుతుంది.