13-06-2024 12:05:00 AM
వచ్చే మూడు సంవత్సరాలలో భారతదేశం ప్రపంచంలోకెల్లా వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ ప్రకటించడం ఆనందదాయకం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సహా రానున్న మూడేండ్లూ భారత్ 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని బ్యాంక్ నివేదిక వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందినట్లు చెబుతున్నారు.
-ఉషా త్రివేణి, సంగారెడ్డి