calender_icon.png 29 August, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింహావలోకనం జరగాలి!

13-06-2024 12:05:00 AM

‘ఒక సామ్రాజ్య పతనం’ శీర్షికన మంగళవారం ‘విజయక్రాంతి’లో వచ్చిన టాప్ స్టోరీలో పత్రిక చైర్మన్ సీఎల్  రాజం విశ్లేషణా త్మక కథనం అనేక వాస్తవాలను వెల్లడించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ నడవడిక మారిపోవడం దగ్గర్నుంచి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు వరకు అనేక అంశాలు బీఆర్‌ఎస్ పతనా నికి దారితీశాయన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నాలుగు నెలల్లోనే మళ్లీ ఎన్నికలకు వెళ్లినా లోక్‌సభలో ఒక్క సీటు కూడా రాకపోవడం ఆ పార్టీ పరిస్థితిని చెప్పకనే చెబుతున్నది. ఇకనైనా, కేసీఆర్ జరిగిన సంఘటనలపై సింహావలోకనం చేసుకోవాలని ఆయన అభిమానులుగా కోరుతున్నాం.

 -అరుణ్‌కుమార్, కొండాపూర్