15-10-2025 12:53:42 AM
హైదరాబాద్,సిటీ బ్యూరో అక్టోబర్ 14 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి నిఘాను కట్టుదిట్టం చేసిన అధికారులు, ఇప్పటివరకు భారీగా నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు న మోదు చేస్తూ, ప్రలోభాలకు కళ్లెం వేస్తున్నా రు.
ఇప్పటివరకు మొత్తం రూ. 88,45,200 నగదును స్వాధీనం చేసుకున్నామని మంగళవారం జిల్లా ఎన్నికల అధికారులు తెలి పారు. ఇందులో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందా లు రూ.12.90 లక్షలు, స్టాటిక్ సర్వులైన్స్ బృందాలు రూ.45.72 లక్షలు, పోలీస్ బృందాలు రూ.29.82 లక్షల నగదును పట్టుకున్నాయి. దీంతోపాటు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న మద్యాన్ని కూడా పెద్ద ఎత్తున పట్టుకుంటున్నారు.
ఇప్పటివరకు మొత్తం 255.56 లీటర్ల మద్యాన్ని, రూ.72,740 విలువైన 0.077 కిలోల డ్రగ్స్‌ను పోలీస్, ఎక్సుజ్ శాఖలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటివరకు మొ త్తం 48 కేసులు నమోదు కాగా, వాటిలో 29 కేసులలో ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. ఎన్నికల నిఘా కోసం అధికారులు అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. నియో జకవర్గం కోసం 45 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 45 స్టాటిక్ సర్వులైన్స్ బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ బృందాల వాహనాలకు జీపీఎస్, పీటీజెడ్ కెమెరాలను అమర్చి, జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి 24/7 పర్యవేక్షిస్తున్నారు. ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీ విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను 100 నిమిషాల్లోనే పరిష్కరిస్తు న్నారు. నియోజకవర్గంలోని మొత్తం 407 పోలింగ్ కేంద్రాలలో 54 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఈ కేంద్రాల వద్ద పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.