calender_icon.png 16 October, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండ్రి జ్ఞాపకార్దం ముదిరాజ్ మహిళా భవనం

15-10-2025 12:54:30 AM

  1. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మందారం నరసింహ గౌడ్ 

ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం 

అమీన్ పూర్, అక్టోబర్ 14 :  అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ తన తండ్రి నందారం మల్లయ్య గౌడ్ జ్ఞాపకార్థం సొంత నిధులతో నిర్మించిన ముదిరాజ్ మహిళా భవనాన్ని మంగళవారం స్థానిక నాయకులతో కలిసి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ముదిరాజుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ముదిరాజ్లకు సముచిత ప్రాధాన్యత అందిస్తున్నామని తెలిపారు. తండ్రి జ్ఞాపకార్థం భవనాన్ని నిర్మించడం పట్ల నరసింహ గౌడ్ ను అభినందించారు. అనంతరం నరసింహ గౌడ్ మాట్లాడుతూ అమీన్ పూర్ మున్సిపాలిటీ ప్రజలకు మున్ముందు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.