calender_icon.png 17 September, 2025 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిపోను ఆకస్మిక తనిఖీ చేసిన ఈడి

17-09-2025 04:26:59 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఆర్టీసీ నిర్మల్ డిపోను కరీంనగర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సొలొమాన్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. డిపో అభివృద్ధిపై సమీక్షించారు. పలు రికార్డులు తనిఖీ చేశారు. యాత్రాధానం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. పేద విద్యార్థులను వికలాంగులను విహార యాత్రలు, తీర్థ యాత్రలు తీసుకువెళ్లేందుకు స్వచ్చంద సంస్థలు, ఎన్.ఆర్.ఐ.లు, దాతలు నాయకులు ఎవరైనా పెద్ద మనసుతో ఆలోచించి పేదలను, వికలాంగులను యాత్రలకు తీసుకువెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను బుక్ చేయించి ఉదారతాను చాటుకోవాలని ఆయన సూచించారు. బస్టాండ్ పరిసర ప్రాంతాలను తనికి చెసారు.  ప్రయాణికులకు స్వచ్చమైన  త్రాగు నీరు అందించాలని సూచించారు. ప్రయాణికులు కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేయాలని, ఫ్యాన్లు ఎల్లప్పుడూ తిరిగేటట్లు చూడాలని సూచించారు. కార్యక్రమములో ఆదిలాబాద్ రీజియన్  డిప్యూటీ ఆర్.ఎం.ఓ.శ్రీహర్ష నిర్మల్ డిపో మేనేజర్ కే.పండరి సహాయ మేనేజర్లు దేవపాల,  నవీన్ కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు.