calender_icon.png 17 September, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు

17-09-2025 04:20:13 PM

మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి పండ్లు, కూరగాయల పంపిణీ..

చిట్యాల (విజయక్రాంతి): భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినం పురస్కరించుకొని చిట్యాల కనకదుర్గమ్మ కూడలిలో నల్గొండ జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరేళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు సేవా కార్యక్రమాల్లో భాగంగా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి పండ్లు, కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన సేవా కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు పాల రవి వర్మ, పిల్లి రవి, ఉండ్రాతీ రాజు, చెరుకు జాని, పెరుమాండ్ల ప్రతిప్, గురిజ రాజు, అనుముల సందీప్, తంగళ్ళపల్లి భువనేశ్వర్,దాసరి శరత్, దాసరి సన్నీ, బర్రె శివ, అనిల్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.