17-09-2025 04:29:12 PM
రక్త దానం చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి..
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) ప్రారంభించారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి స్వయంగా రక్తదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మోదీ నాయకత్వంలో దేశం ఎంతో పురోగతి చెందుతుందన్నారు. ప్రజల కోసం, దేశం కోసం ఆలోచన చేసే మోదీ నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రక్తదానం చేసిన నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్, మేడిసెమ్మ రాజు, సత్యనారాయణ గౌడ్, మల్లికార్జున్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు, తాజా మాజీ కౌన్సిలర్ లు, పట్టణ, మండల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.