calender_icon.png 16 September, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవితంలో విజయానికి విద్య కీలకం..

16-09-2025 07:43:36 PM

- ఉపాధ్యాయులు విద్యార్థుల జీవితాలను సుంపెన్నం చేయడానికి కృషి చేస్తారు..

- ఉత్తమ పండితులకు సన్మాన మహోత్సవ కార్యక్రమం...

- ఎంపీడీవో యుగేందర్, ఎంఈఓ మల్లేశం

మునుగోడు (విజయక్రాంతి): జీవితంలో విజయానికి విద్య కీలకమని ఉపాధ్యాయులు విద్యార్థుల జీవితాలను సంపానం చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తారని ఎంపీడీవో యుగేందర్ రెడ్డి, ఎంఈఓ మల్లేశం అన్నారు. మంగళవారం గురుపూజోత్సవం సందర్భంగా మండల స్థాయి ఉపాధ్యాయులుకు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి కే బాల ప్రసాద్, రాధిక, సిహెచ్ వెంకటయ్య, జె బాలయ్యతో కలిసి అవార్డులు అందజేసి ఘనంగా సన్మానించి మాట్లాడారు. ఉపాధ్యాయులు మన జీవితాలను ప్రభావితం చేసే వారిలో ఒకరు అని,ప్రతి మనిషికి ఉపాధ్యాయులు తమ జీవితాలపై చూపిన ప్రభావం గురించి చెప్పడానికి ఒక కథ ఉంటుంది అని అన్నారు.

ఉపాధ్యాయులు తమ విద్యార్థుల జీవితాలను సుసంపన్నం చేయడానికి సాధ్యమైనంత ఎక్కువ కృషి చేస్తారు, వారు మన సమాజంలో గొప్ప మార్పులను తీసుకువస్తారు. ఉపాధ్యాయులు వారి విద్యార్థుల జీవితాల్లో శాశ్వత ప్రభావాన్ని , కృషితో, ఒక ఉపాధ్యాయుడు వారి విద్యార్థులకు మార్గాన్ని వెలిగిస్తాడు. వారి అంకితభావం, కృషిని మనం గమనించకపోతే అది పొరపాటు అవుతుందని, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారిని అభినందించడం వల్ల వారు విద్యార్థులకు విద్యను అభ్యసించేందుకు మరింత కీలకపాత్ర పోషిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉన్నారు.