calender_icon.png 17 September, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా..

16-09-2025 07:45:05 PM

డ్రైవర్ కు తీవ్ర గాయాలు...

అదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా సీతాగొంది జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. కేరళ నుండి మహారాష్ట్రలోని నాగపూర్ కు చేపల లోడ్ తో వెళ్తున్న లారీ మంగళవారం గుడిహత్నూర్ మండలం సీతాగొంది జాతీయ రహదారిపై లారీ టైరు పేలడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అబ్బు తాయర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రున్ని రిమ్స్ కు తరలించారు.