03-09-2025 06:18:14 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అన్నారు. నిర్మల్ పట్టణంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులు చదువుకుంటున్న అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాను ఈ ప్రాంతం చెందిన వ్యక్తిని కష్టపడి చదవడం వల్లనే ఈ స్థాయికి ఎదిగినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు