03-11-2025 02:06:58 AM
5 రోజులుగా కొనసాగుతున్న వరద
పాపన్నపేట, నవంబర్ 2: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మెదక్ జిల్లా పాపన్నపేట మం డలం ఏడుపాయల వన దుర్గమ్మ 5 రోజులుగా గంగమ్మ ఒడిలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు గేట్లు వదలడంతో ఆలయం చెంత వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. 5 రోజులుగా శాంతించకపోవడంతో ఆలయం వద్ద ఉన్న ఏడు నదీ పాయలు పరవళ్లు తొక్కుతున్నాయి.
దీంతో ఆలయం జలదిగ్బంధం లోనే ఉంది. సింగూరు నుంచి దిగువకు నీటిని వదలడంతో ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నుండి పొంగిపొర్లుతోంది. రాజగోపురంలో వనదుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అమ్మ దర్శనం కల్పిస్తున్నారు.