calender_icon.png 3 November, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రాల నెపంతో హత్య

03-11-2025 02:08:53 AM

ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం పిట్టగూడాలో చోటుచేసుకుంది. పిట్టగూడాకు చెందిన ఉర్వేత హనుమంతరావు(52) మంత్రాలు చేస్తున్నాడని అదే గ్రామానికి చెందిన రాయిసిడం వినోద్ హత్య చేశాడు.

హనుమంతరావు మెడపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలి మరణించగా, కుటుంబ సభ్యులు గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూఢనమ్మకాలను విశ్వసించవద్దని, ఇలాంటి ఘటనలు గమనించినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని రెబ్బెన సీఐ సంజయ్ కుమార్ తెలిపారు.