calender_icon.png 20 October, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా సిస్టాస్ ప్రీ స్కూల్ ప్రారంభం

20-10-2025 01:13:57 AM

  1. మళ్లీ చదువుకోవాలని ఉంది: అలీ

చిన్నప్పుడే పునాది పడాలి: బ్రహ్మానందం

చదువే పిల్లలకు ఇచ్చే ఆస్తి: శివాజి

మరో 50 స్కూల్స్ పెడతా: ఛైర్మన్ లోహిత్

మణికొండ, అక్టోబర్ 19, విజయక్రాంతి: దీపావళి పండుగ వేళ మణికొండలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి నెలకొంది. గోల్డెన్ టెంపుల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సిస్టాస్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్’ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు అలీ, బ్రహ్మానందం, శివాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

నటుడు అలీ, నటి ఎస్తర్, ఇన్‌ఫుెు్లన్సర్ బెజవాడ బేబక్క(మధు)లతో కలిసి పాఠశాల ఛైర్మన్ లోహిత్ రిబ్బన్ కట్ చేసి స్కూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. “ఇక్కడి వాతావరణం చూస్తుంటే మళ్లీ చిన్నపిల్లాడిలా స్కూల్‌కి వెళ్లాలనిపిస్తోంది. చదువు విలువ తెలిసిన వాడిని కాబట్టే ఆరు భాషలు నేర్చుకున్నా” అన్నారు.

అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ.. “పిల్లలకు చిన్న వయసులోనే మంచి విద్యతో పునాది వేయాలి. ఆ దిశగా లోహిత్ చేస్తున్న కృషి అభినందనీయం” అని పేర్కొన్నారు. “నేను సంపాదించే ఆస్తి కన్నా, నా పిల్లలకు మంచి చదువునే ఇస్తానని చెప్పాను. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ స్కూల్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది” అని శివాజి అన్నారు.

ఈ వేడుకలో నటులు రఘుబాబు, ప్రవీణ్, హీరోయిన్ దివి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జైలు సూపరింటెండెంట్ దామర్ల కాళిదాసు తదితరులు పాల్గొన్నారు. తమ స్కూల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రముఖులకు ఛైర్మన్ లోహిత్ కృతజ్ఞతలు తెలిపారు. అందరి ఆశీస్సులతో భవిష్యత్తులో మరో 50 బ్రాంచీలను ఏర్పాటు చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.