10-11-2025 06:56:41 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులకు, భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ఉపయోగపడే రక్షణ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చే రోజుల్లో వర్షాలు, వరదల నుంచి రక్షణ పొందేందుకు ఈ కిట్లు ఉపయోగపడతాయని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు అవసరమయ్యే పరికరాలు ఈ కిట్ లో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పి సీఈవో గోవింద్, మండల ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.