విద్యార్థుల్లో చిరస్థాయిగా నిలిచే అభ్యసన ఫలితాల సాధనకు కృషి చేయాలి
అనురాగ్ విశ్వవిద్యాలయం చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
ఘట్ కేసర్, జూన్ 11 (విజయక్రాంతి): విద్యార్థుల్లో చిరస్థాయిగా నిలిచే అభ్యాస ఫలితాలను సాధించే దిశగా అధ్యాపకులు కృషి చేయాలని అనురాగ్ విశ్వవిద్యాలయం చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. అనురాగ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ కేపీఎంజీతో భాగస్వామ్యం కుదుర్చుకుని ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఎంబీఏబీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్) ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ మేరకు గురువారం విశ్వవిద్యాలయం ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని వెంకటాపూర్ క్యాంపస్లో అనురాగ్ విశ్వవిద్యాలయం, కేపీఎంజీ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సం తకాలు జరిగాయి. ఈ సందర్భంగా అనురా గ్ విశ్వవిద్యాలయ చైర్మన్ పల్లా రాజేశ్వర్ రె డ్డి మాట్లాడుతూ ట్రస్ట్ 24 ఏళ్ల విద్యా ప్రస్థానాన్ని గుర్తుచేశారు.
2002లో కేవలం 180 మంది విద్యార్థులతో ప్రారంభమైన ప్రయా ణం ప్రస్తుతం ప్రతి ఏడాది 16 వేల మంది విద్యార్థులకు విద్యను అందించే స్థాయికి చేరుకుందని తెలిపారు. మౌలిక సదుపాయా లు, నాణ్యమైన అధ్యాపక బృందం, ఉత్తమ అభ్యాస పర్యావరణం అనే మూడు అంశాలపై దృష్టి సారించడమే ఈ అభివృద్ధికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.
కేపీఎంజీ నేషనల్ లీడర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ నారాయణన్ రామస్వామి మాట్లాడుతూ విద్యారంగం వేగంగా మారుతోందని, ముఖ్యంగా భారత్లో బిఎఫ్‌ఎస్‌ఐ రంగంలో అనేక వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల స మర్థవంతమైన అభ్యాసం కోసం 3సీలు కం టెంట్, కాంటెకస్ట్, కమ్యూనికేషన్ అత్యంత అవసరమని వివరించారు. ఈ కార్యక్రమం లో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగాధిపతి ప్రొఫెసర్ విష్ణు వందన, ఉట్ల బాలాజీ, వీసీ అర్చన, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






