calender_icon.png 6 July, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కోసం రైతుల రాస్తారోకో

27-05-2025 12:00:00 AM

తహసీల్దార్, పోలీసుల జోక్యంతో శాంతించిన రైతులు

పెబ్బేరు మే 26: మండల పరిధిలోని శేరుపల్లి రహదారిపై వరిధాన్యం తక్షణమే కొనుగోలు చేయాలని శ్రీరంపూర్ మండలం శేరుపల్లి రైతులు రాస్తారోకో సోమవారం ఉదయం నిర్వహించారు.

గత కొన్ని రోజులుగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, ధాన్యం కొనుగోలు సక్రమంగా నిర్వహించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కాంటా అయిన ధాన్యం తరలించటంలో టెండరుదార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

అకాల వర్షాల కారణంగా రైతుల కష్టం మట్టిపాలవుతుందని ఆగ్రహించిన రైతులు కొల్లాపూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తహసీల్దార్ మురళి గౌడ్ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడి స్పష్టమైన హామీ ఇచ్చారు. అనంతరం రైతులు శాంతించి రాస్తారోకో కార్యక్రమం ముగించారు. ఈకార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.