calender_icon.png 23 July, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకులకు 20 శాతం సీట్లు ఇవ్వండి

23-07-2025 01:12:24 AM

సీఎంను కోరిన శివచరణ్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 22 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డిని మంగళ వారం రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు 20 శాతం సీట్లను కేటాయించాలని సీఎంను కోరారు. ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ బలోపే తానికి కృషి చేసిన అర్హత గల యువజన కాంగ్రెస్ నాయకులకు తగిన గుర్తింపు ఇచ్చి సీట్ల కేటాయింపులో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.