calender_icon.png 2 May, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ దెబ్బతో హమాలీ మృతి

01-05-2025 10:30:36 PM

మంథని (విజయక్రాంతి): మంథని మున్సిపల్ పరిధిలో గంగాపురి గ్రామానికి చెందిన పులి మణి(55) వడదెబ్బతో గురువారం మృతి చెందాడు. గంగాపురిలోనీ వరి ధాన్య కొనుగోలు కేంద్రానికి హమాలీ పనికి వెళ్లి ఇంటికి వచ్చిన మణి అస్వస్థతకు గురి అయ్యాడు. ఇతన్ని కుటుంబ సభ్యులు చికిత్స కోసం మంథని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.