calender_icon.png 2 May, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాడవాడల రెపరెపలాడిన అరుణ పతాకం

01-05-2025 10:22:45 PM

ఘనంగా మేడే వేడుకలు..

మందమర్రి (విజయక్రాంతి): చికాగో అమర వీరులను స్మరిస్తూ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలను పట్టణంలో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కార్మిక సంఘాల కార్యాలయాలు ఎర్ర జెండాలతో కలకల లాదాయి. పట్టణ అధ్యక్షులు ముఖ్య కూడల్లలో జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎర్రజెండాలు ఆవిష్కరించి చికాగో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. 8 గంటల పని విధానం కోసం చికాగో కార్మికులు చేసిన వీరోచిత పోరాటం ఫలితంగా ఎనిమిది గంటల పని విధానం అమలైందని వారిని స్మరించుకున్నారు.

పట్టణంలోని ఏఐటీయుసీ కార్యాలయంలో ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, సిఐటియు కార్యాలయంలో సిఐటియు డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్ నాగరాజు గోపాల్, హెచ్ఎంఎస్ కార్యాలయంలో హెచ్ఎమ్ఎస్ జిల్లా అధ్యక్షులు సుదర్శన్,  ఐఎన్టియుసి కార్యాలయంలో ఏరియా నాయకులు దేవి భూమయ్య ఎర్ర జండాలను ఆవిష్కరించి చికాగో అమర వీరులకు నివాళులర్పించారు. మేడే ను పురస్కరించుకొని పట్టణంలోని పలు ముఖ్య కూడల్లలో ఎర్రజెండాలు ఆవిష్కరించారు. అంతేకాకుండా ఏరియాలోని సింగరేణి గనులు, డిపార్టుమెంటులలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండాలను ఆవిష్కరించారు.