01-05-2025 10:26:44 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మే డే సందర్భంగా మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ సీతామాలక్ష్మి దంపతుల తనయుడు సూర్యచంద్ర పుట్టినరోజును పురస్కరించుకొని కేసముద్రం పట్టణంలో కార్మికులకు బుధవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్ నీలం సుహాసిని దుర్గేష్, మాజీ ఎంపీపీ ఓలం చంద్రమోహన్, మాజీ జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, కమటం శ్రీనివాస్, జాటోత్ హరీష్ నాయక్, గుగులోత్ వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు.