01-05-2025 10:25:10 PM
బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగంటి విజయ్ గౌడ్...
మునుగోడు (విజయక్రాంతి): సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50% పరిమితిని ఎత్తివేసి తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పెంచే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగంటి విజయ గౌడ్ కోరారు. గురువారం బీసీ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని జూబ్లిహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో కలిసి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చట్ట పరమైన ఎలాంటి చిక్కులు ఎదురుకాకుండా శాస్త్రీయ పద్ధతిలో దేశంలో కుల గణన పూర్తి చేసిన ఘనత తెలంగాణకు దక్కుతుందని, ఇది దేశానికి రోల్ మాడల్‌గా ఉంటుందని వారు ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణలో విజయవంతంగా కుల గణన పూర్తి చేసిన నేపథ్యంలో కేంద్రం బిసి కులగణ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెల్పడం సంతోషకరమైన పరిణామంగా వారు పేర్కొన్నారు.