calender_icon.png 2 May, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేయాలి

01-05-2025 10:20:02 PM

విధుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి...

డయల్ -100 కాల్స్ కు బ్లూ కోల్ట్స్ సిబ్బంది వెంటనే స్పందించాలి..

ఆన్లైన్ బెట్టింగ్స్, సైబర్ క్రైమ్ పై ప్రజల్లో అవగాహన పెంచాలి..

నసుల్లాబాద్  పోలీస్ స్టేషన్ ను  ఆకస్మికoగా తనిఖీ చేసిన ఎస్పి..

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర..

కామారెడ్డి (విజయక్రాంతి): జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర నసురుల్లాబాద్ పోలీస్ స్టేషన్ ను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్  రికార్డ్స్ ను, రిసెప్షన్, స్టే షన్ రైటర్, టెక్ టీమ్, ఎస్ హెచ్వో, మెన్ రెస్ట్ రూమ్, లాక్ అప్ రూమ్ ను స్టేషన్ పరిసరాలను పార్కింగ్ ప్రదేశాలు పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో  సిబ్బంది నిర్వహిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లోని పరిసరాలు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే డయల్-100 కాల్స్ కు వెంటనే స్పందించాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర నసురుల్లాబాద్ ఎస్సైకి సూచించారు.

ఈ సందర్భంగా ఎస్పీ స్టేషన్ సిబ్బందితో మాట్లాడుతూ... ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రాపర్ గా బ్లూ కోల్ట్, పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. విసృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను తగ్గించాలన్నారు. సిబ్బంది వారికి కేటాయించిన గ్రామలకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించాలి అదేవిధముగా  తరచూ గ్రామాలను సందర్శించి సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై, మూడనమ్మకాలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఎస్పి సూచించారు.