01-05-2025 10:51:16 PM
హన్మకొండ (విజయక్రాంతి): కాజిపేట బాపూజీ నగర్ పోచమ్మ గుడి కమ్యూనిటీ హల్లో అన్ని కార్మిక సంఘలా ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని మే డే జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే చేత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతుంది. ఈ సమయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో పలు అభివృద్ధి పనుల, కాజిపేట బస్ స్టాండ్ స్థలం కోసం మంజూరు చేయడం జరిగింది. అలాగే మామునుర్ ఎయిర్ పోర్ట్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.
కాజిపేట్ ఫాతిమా బ్రిడ్జ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నవి, నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని, గత పాలకులు, నాయకులు కార్మికులను తమ స్వార్ధనికి ఉపయోగించుకున్నార. కాని నేను కార్మిక పక్షపాతిని గత సంవత్సరం మే డే రోజున కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు అన్ని సంఘాలకు కార్మిక భవన్ నిర్మాణం కొరకు 150గజాలు స్థలం మంజూరు పట్టాను ఈ రోజు కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది. కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు ఇంకా 150 గజాలు మంజూరు చేస్తానని అన్నారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతు కార్మిక భవన్ కు స్థలం మంజూరు చేసిన ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ యొక్క కార్మిక భవన్ స్థలం కొరకు కృషి చేసిన మైసారపు సీరిల్ లారెన్స్ కి కృతజ్ఞతలు, ధన్యవాదలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో 62, 63 డివిజన్ల కార్పొరేటర్లు జక్కుల రవీందర్, విజయశ్రీ రాజాలి మాజీ కార్పొరేటర్ అబుబక్కర్, సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఎండి అంకుష్, సిలువేరు విజయభాస్కర్, కార్మిక నాయకులు కాజిపేట్ ఎలక్ట్రీషియన్ యూనియన్ ప్రెసిడెంట్ పోగుల జక్సన్, ప్రధాన కార్యదర్శి భాస్కర్, పెయింటర్స్ యూనియన్ అధ్యక్షులు గబ్బట ఎల్లేష్, ప్రధాన కార్యదర్శి కనకం శివకుమార్, మేస్త్రి సంఘం అధ్యక్షులు ఇమ్మడి బాబు, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, మార్బల్ యూనియన్ అధ్యక్షులు రఫీ, ప్రధాన కార్యదర్శి భాష, కాజీపేట టెంట్ హౌస్ యూనియన్ అధ్యక్షుడు సర్వర్ పాషా, ప్రధాన కార్యదర్శి సుధాకర్, చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులు షేక్ అస్గర్, కాజిపేట్ ట్రైసిటీ ఆటో యూనియన్ అధ్యక్షుడు గడిపి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నర్మెట మధుకర్, కోశాధికారి జేరిపోతుల వెంకన్న, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.