calender_icon.png 2 May, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మే డే స్ఫూర్తితో సమ్మె హక్కును కాపాడుకుంటాం

01-05-2025 10:38:51 PM

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నాగరాజు గోపాల్...

మందమర్రి (విజయక్రాంతి): 139వ మేడే స్ఫూర్తిగా కార్మికుల హక్కుల కోసం రాజీ లేని పోరాటాలు చేస్తామని, సమ్మె హక్కును కాపాడుకుంటామని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్ నాగరాజు గోపాల్ స్పష్టం 139వ మే డే వేడుకలను పురస్కరించుకొని పట్టణంలో, వివిధ గనుల్లో సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నాలుగు లేబర్ కోఢ్ అని లలో సమ్మె లేకుండా చేసేలా కుట్ర పన్నుతుండగా చికాగో అమరవీరుల స్ఫూర్తితో సమ్మె హక్కును కాపాడుకుంటామని, 8 గం.ల పని కోసం చికాగోలో పలువురు కార్మికులు అమరులయ్యారని వారి స్ఫూర్తితో పని గంటల పెంపును వ్యతిరేకిస్తూ అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి పని గంటల పెంపును వెనక్కు తీసుకునేలా ఉద్యమిస్తామన్నారు.

కలిసి మెలిసి ఉండే శ్రామికుల మధ్య కులం, మతం పేరుతో చిచ్చు పెడుతూ కార్మికులను విడగొట్టాలనీ చూసే వారికి ఐక్య ఉద్యమాల ద్వార తగిన బుద్ధి చెబుతోందన్నారు. హక్కుల సాధనకోసం ప్రతి కార్మికుడు తన వంతు బాధ్యతగా నాటి చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఆందోళనలు ప్రదర్శనలో పాల్గొనాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురాను న్న లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా మే 20న జరిగే దేశ వ్యాప్త సమ్మె ను సింగరేణిలో విజయవంతం చేసి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల పట్ల ర్యాలీలు ధర్నాల ద్వారా నిరసన తెలుపాలని కార్మిక వర్గానికి ఆయన విజ్ఞప్తి చేశారు. యూనియన్ల జెండా రంగులు వేరైనా చికాగోలో అమరవీరులైన కార్మికుల స్ఫూర్తితో ఎర్రజెండాను ఎగురవేస్తారని, అంతటి ప్రాముఖ్యత ఎర్ర జెండాకు ఉందన్నారు.

వేతనాల పెంపుకై ఎర్రజెండా వైపు చూసే కార్మికులను రాజకీయ అధికారంతో ఎర్రజెండా వైపు చూడకుండా తాత్కాలిక ప్రలోభాలకు గురిచేస్తున్న ప్రజా ప్రతినిధుల వైఖరిని గమనించాలని ఆయన కోరారు. అనంతరం పట్టణంలోని మార్కెట్లోని అంబేద్కర్ విగ్రహం నుండి యూనియన్ ఆఫీస్ వరకు నినాదాలతో పాదయాత్ర చేస్తూ ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు సాంబార్ వెంకటస్వామి, అల్లి రాజేందర్, ఉపాధ్యక్షులు రామగిరి రామస్వామి, సీనియర్ నాయకులు వడ్లకొండ ఐలయ్య, అన్ని గనుల ఫిట్ సెక్రటరీలు కార్మికులు పాల్గొన్నారు.