10-01-2026 12:50:09 AM
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
మునుగోడు, జనవరి 9 (విజయ క్రాంతి): ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అట్టి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని సీపీఐ జిల్లా కార్యదర్శి,ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధి హామీ సిబ్బంది పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు.ఈ సందర్భంగా పలువురు ఉపాధి హామీ ఉద్యోగులు మాట్లాడుతూ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
ఎమ్మెల్సీని సన్మానించిన చేనేత కార్మికులు..
చేనేత కార్మికుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించిన ఎమ్మెల్సీ సత్యం ను మునుగోడు, పలివల, కొరటికల్ గ్రామాల చేనేత కార్మిక సంఘాల నేతలు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలతో సన్మానించారు. అనంతరం వివిధ అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొంది సీఎంఆర్‌ఎఫ్ కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుండి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు.
ఆయా కార్యక్రమంలో గురుజ రామచంద్రం, తీర్పాటి వెంకటేశ్వర్లు, ఈదులకంటి కైలాస్, నాగరాజు, టీఏలు నవనీత, అలివేలు, కృష్ణవేణి, సీఓ నరసింహ, చేనేత కార్మిక సంఘం నాయకులు చెరుకు సైదులు పాల్గొన్నారు.