10-01-2026 12:48:47 AM
నివాళులర్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి
నూతనకల్, జనవరి 9: మండల పరిధిలోని మాచనపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీరబొయిన వెంకన్న మాతృమూర్తి వీరబొయిన అనసూర్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం కన్నుమూశారు.విషయం తెలుసుకున్న తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి మాచనపల్లి గ్రామానికి చేరుకుని, అనసూర్య గారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కొంపెల్లి మల్లారెడ్డి, పగ్గిళ్ల అశోక్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పసుల అశోక్ యాదవ్, సోషల్ మీడియా మండల కోర్డినేటర్ బోల్క సైదులు యాదవ్, గుగులోత్ రవి, రామచంద్రు, బాలు నాయక్, వీరన్న, సురేష్, గంగన్న, మల్లయ్య, గంగాధర్, లింగయ్య పాల్గొన్నారు.