10-01-2026 12:51:32 AM
మర్రిగూడ (నాంపల్లి) జనవరి 9 (విజయ క్రాంతి): విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటి సాధనకు కృషి చేయాలని ఈ .ఎల్. వి. భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు . కళాశాల ప్రిన్సిపల్ గంధం మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు ఇంటర్మీడియట్ దశలోనే ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలన్నారు . కళాశాల స్థాయిలో ఇంటర్మీడియట్ దశ కీలకమన్నారు.
ఇంజనీరింగ్, మెడిసిన్ ఇతర ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలకు సిద్ధం కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న స్తోమత లేని పేద విద్యార్థుల ఉన్నత చదువులకు తన వంతు సహాయం అందిస్తానన్నారు. ఫౌండేషన్ ద్వారా జిల్లాలోని పలువురు విద్యార్థులకు మెడిసిన్ చదివేందుకు ఆర్థిక ఉపకార వేతనం అందిస్తున్నట్లు తెలిపారు.
కళాశాలకు వితరణ:
నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల కు రూపాయలు 40 వేల విలువగల మైక్ సెట్ ,సౌండ్ బాక్స్ లను ఫౌండేషన్ ద్వారా అందజేశా రు. కళాశాల లో నిర్వహించిన రంగోలి పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కళాశాల లో బోరు వేయిస్తానని, పేదరికంతో ఉన్న విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు, పోటీ పరీక్షల కోసం కళాశాల లైబ్రరీకి తగిన పుస్తకాలు వితరణ చేస్తానని తెలిపారు.
కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ వినియోగించుకునేందుకు తగిన ఏర్పాట్లను చేస్తానని, ప్రత్యేక గదులను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఈ ఎఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ డైరెక్టర్ అశోక్ తదితరులు సర్పంచులు దామెర శోభ సహదేవ్, కడారి శ్రీశైలం యాదవ్, పెరికేటి రమేష్, ఈ ఎల్ బి ఫౌండేషన్ సభ్యులు తల్లోజు ప్రవీణ్ చారి నరేష్ పానగంటి మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.