calender_icon.png 11 October, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈహెచ్‌ఎస్, ఒక డీఏ అమలు చేయండి

10-10-2025 01:37:04 AM

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య ప థకం విధి విధానలు ఏర్పాటు చేసి ఈహెచ్‌ఎస్‌ను అమలు చేయాలని సీఎస్ రామకృష్ణారావుకు టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీ శ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీ నివాస్‌రావు వినతిపత్రం అందజేశారు. గురు వారం సచివాలయంలో సీఎస్‌ను కలిసి గతంలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ఒక డీఏ విడుదల చేయాలని, జాయింట్ స్టాప్ కౌన్సిల్‌ను సమావేశపర్చి మిగిలిన సమస్యలపై చర్చించి పరిష్కరించాలని కోరారు. వీటిపై సీఎస్ సానుకూలంగా స్పందించారని  జగదీష్ తెలిపారు. సీఎస్‌ను కలిసిన వారిలో దామోదర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సదానందగౌడ్, రమేష్, ముజీబ్ హుస్సేన్, వెంకటే శ్వర్లు, శ్యామ్, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.