23-04-2025 01:12:47 AM
హనుమకొండ, ఏప్రిల్ 22 (విజయ క్రాంతి): 2025 ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యున్నత మార్కులతో హనుమకొండలోని ఏకశిలా జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో విజయ దుందుభి మోగించి తెలంగాణకే మణిహారంగా ఏకశిల విజయ విహారం చేసింది.
ఎంపీసీ ప్రధమ సంవత్సరం ఫలితాల్లో పి. కావ్య 468/470, పి సాయి గణేష్ 466/470, డి.సాయిరాజ్ 466/470, ఎం గణేష్ 466/470 మార్కులతో ఉత్తీర్ణులై రాష్ట్రస్థాయిలో విజయ పతాకం ఎగురవేశారు. అలాగే బైపిసి విభాగంలో 437/440, పి.అర్చన 437/440, పి. హాసిక 436/440, ఈ.అర్చన 436/440 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. అలాగే సీఈసీ విభాగంలో ఎండి.సానియా 488/500, ఏ.రష్మిక 487/500, ఎం ఈ సి విభాగంలో టి.అశ్విత 495/500 మార్కులతో ఉత్తీర్ణురాలై రాష్ట్రస్థాయి గుర్తింపు పొందింది.
ద్వితీయ సంవత్సరంలో కూడా ఏకశిలదే పై చేయి
ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఏకశిలా విద్యార్థులు ఎంపీసీ విభాగంలో జె.ప్రతిశ్వర్ 933/1000, ఈ.మనోజ్ఞ 990/1000 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. అలాగే బైపిసి విభాగంలో డి.లక్ష్మీ వైష్ణవి 990/1000, సి ఈ సి విభాగంలో సుమయ తన్వీర్ 974/1000 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకులతో ఏకశిల ప్రతిభను ఎలుగెత్తి చాటారు.
ఈ సందర్భంగా ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ నిరంతర యాజమాన్య పర్యవేక్షణతో పటిష్టమైన ప్రణాళిక సమిష్టి కృషి సహజ నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రేరణ తరగతులు ఒత్తిడి లేని విద్య కోసం ప్రముఖ వ్యక్తులతో అవగాహన సదస్సులతోపాటు అత్యుత్తమమైన బోధన క్రమశిక్షణతో కూడిన విద్యా విధానంతో ఇంటర్ ఫలితాల్లో అన్ని విభాగాల్లో రాష్ట్రస్థాయిలో ఏకశిలా విద్యాసంస్థలు అగ్రశ్రేణి లో నిలుస్తున్నాయని చెప్పారు. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ ఫలితాల్లో విజయదుంది మోగించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అభినందించారు.