calender_icon.png 7 July, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

06-07-2025 11:10:03 PM

అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన..

అబ్దుల్లాపూర్‌మెట్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్(Abdullapurmet Police Station) పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇనాం గూడా గ్రామం యశోద నగర్ చెందిన కుంచపు శ్రీనివాస్(48) అతని భార్య(39) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తారు. వీరికి ఇద్దరు పిల్లలు  కుమార్తె రాజేశ్వరి(19), కుమారుడు రాంబాబు(17) ఉండగా.. వీరు, వీళ్ళ బంధువులతో కలసి వ్యక్తిగత పని నిమిత్తం ఆదివారం ఉదయం కీసరకు వెళ్లారు. తిరిగి సాయంత్రం ఇనాం గూడాకు వచ్చే క్రమంలో ఇనాంగూడా హెచ్​పీ పెట్రోల్​ బంక్​ వద్ద హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారి దాటుతుండగా.. గుర్తు తెలియని  కంటైనర్​ లారీ కుంచపు శ్రీనివాస్​ ను ఢీకొట్టింది.

దీంతో శ్రీనివాస్​ అక్కడిక్కడే మృతి చెందిగా.. భార్య కుంచపు లక్ష్మీకి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని మనోజ్ఞ దవాఖానకు తరలించారు. శ్రీనివాస్​ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియ దవాఖానకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్​మెట్ ఇన్​స్పెక్టర్ వి. అశోక్​రెడ్డి తెలిపారు.