12-12-2025 12:00:00 AM
ఉప్పల్ డిసెంబర్ 11విజయక్రాంతి : అనుమానాస్పసితిలో ఓ వృద్ధురాలు మృతి చెంది న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్రనగర్‌లో నివాసం ఉంటున్న బొమ్మిడి సబిత (50) తన ముగ్గురు పిల్లలతో కలిసి రాఘవేంద్రనగర్‌లో నివాసం ఉంటుం ది. వృత్తిరిత్య కూరగాయల వ్యాపారం చేస్తున్న సబితా ఇటీవల కాలంలో ఇంటి వద్ద కాలుజారి కింద పడింది.
దీంతో మోకాలు నడు ముకు తీవ్రమైన గాయాలు జరిగాయి. అంతకుముందుకే గొంతు దగ్గర గడ్డ కావడంతో ఆరోగ్యం కూడా సరిగా లేదు. బుధవారం రోజున రాత్రి అందరి లాగా నిద్ర పోయిన సబితా గురువారం పొద్దున ఎంత లేపిన లేవకపోవడంతో 108 సమాచారం ఇవ్వగా అం బులెన్స్ సిబ్బంది వచ్చి పరిశీలించారు అప్పటికే సబిత మృతి చెందినట్లు సిబ్బంది నిర్ధారించారు. అయితే సబిత కూతురు శిరీష తల్లి మృతిపై అనుమానం ఉందంటూ ఉప్ప ల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శిరీష ఫిర్యా దు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు