calender_icon.png 12 December, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్బీనగర్ నియోజకవర్గంలో డివిజన్ల పునర్విభజన

12-12-2025 12:00:00 AM

  1. నూతనంగా ఏడు డివిజన్లు ఏర్పాటు 
  2. మొత్తంగా 18 డివిజన్లతో  రాజకీయ వర్గాల్లో ఉత్సాహం 
  3. అభ్యంతరాలు స్వీకరిస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులు 

ఎల్బీనగర్, డిసెంబర్ 11 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో డివిజన్ల పునర్విభజనతో నూతన డివిజన్ల ఏర్పాటుతో పాటు రాజకీయ వర్గాల్లో నూతనోత్సాహం కనిపిస్తుంది. జీహెచ్‌ఎంసీలో శివారు ప్రాంతాలను విలీనం చేసిన అనంతరం నూతన డివిజన్లను వాటి పేర్లలో ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకటించారు. కాగా, ఎల్బీనగర్ జోనల్ లోని హయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్ సర్కిళ్ల పరిధిలోని  డివిజన్లను పునర్విభజన చేశారు.

నూతనంగా 9 నూతన డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మూడు సర్కిళ్లలో ఇప్పటివ రకు మొత్తం 13 డివిజన్లు ఉండగా, వాటి స్థానంలో మొత్తం 22 డివిజన్లు రానున్నాయి. నూతన డివిజన్ల ఏర్పాట్లపై అభ్యం తరాలు, సలహాలు, సూచనలు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు కోరుతున్నారు.  ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో ఇప్పటివరకు 11 డివిజన్లు ఉన్నాయి. 

ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 11 డివిజన్లు ఉన్నాయి. వీటికి అదనంగా నూతనం గా 7 డివిజన్లు ఏర్పాటు చేయడంతో మొ త్తంగా 18 డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సరూర్ నగర్, ఆర్కేపురం డివిజన్లను సైతం పునర్విభజన చేశారు. రెండు డివిజన్ల స్థానం లో మరో రెండు డివిజన్లు ఏర్పాటు చేశారు. 

నూతన డివిజన్ల వివరాలు 

ఎల్బీనగర్ నియోజకవర్గం జీహెచ్‌ఎంసీ జోనల్ పరిధిలో ఇప్పటి వరకు మూడు సర్కిళ్ల ఉన్నాయి. వీటిలో హయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్ సర్కిళ్లు ఉన్నాయి. హయత్ నగర్ సర్కిల్ పరిధిలో నాలుగు డివిజన్లు నాగోల్, మన్సూరాబాద్, హయత్ నగర్, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్లు ఉన్నాయి. ఎల్బీనగర్ సర్కిల్ లో ఇప్పటివరకు వనస్థలిపురం, హస్తినాపురం, చంపాపేట, లింగోజిగూడ డివిజన్లు ఉన్నాయి.

సరూర్ నగర్ సర్కిల్ లో ఇప్పటివరకు కొత్తపేట, చైతన్యపురి, గడ్డిఅన్నారం, సరూర్ నగర్, ఆర్కే పురం డివిజన్లు ఉన్నాయి. మూడు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లను పునర్విభజన చేసి, కొత్తగా ఎనిమిది డివిజన్లు ఏర్పాటు చేశారు. సరూర్ నగర్ సర్కిల్ పరిధిలోని కొత్తపేట, చైతన్యపురి, గడ్డిఅన్నారం డివిజ న్లను యథావిధిగా ఉంచారు. అయితే, మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్ నగర్ డివిజన్ ను విభజించి డాక్టర్స్ కాలనీ పేరుతో కొత్త డివిజన్, రామకృష్ణాపురం డివిజన్ ను విభజించి ఎన్టీఆర్ నగర్ పేరుతో నూతన డివిజన్ ఏర్పాటు చేశారు. 

ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఎల్బీనగర్ సర్కిల్ లో ఉన్న చంపాపేట డివిజన్ విభజించి నూతనంగా కర్మన్ ఘాట్,  హస్తినా పురం డివిజన్ నుంచి   బైరామల్ గూడ, వనస్థలిపురం డివిజన్ నుంచి చింతలకుంట,  నాగోల్ డివిజన్ నుంచి సాయినగర్, మన్సూరాబాద్ డివిజన్ నుంచి లెక్చరర్స్ కాలనీ, హయత్ నగర్ డివిజన్ నుంచి హైకోర్టు కాలనీ, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ నుంచి  సాహెబ్ నగర్ డివిజన్లను ఏర్పాటు చేశారు. తాజాగా ఎల్బీనగర్  నియోజకవర్గంలో  7 డివిజన్లు, మహేశ్వరం నియోజకవర్గంలో 2 నూతన డివిజన్లు ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని సరూర్ నగర్ సర్కిల్ పరిధిలోని కొత్తపేట, చైతన్యపురి, గడ్డిఅన్నారం డివిజన్లను యథావిధిగా ఉంచారు. 

రాజకీయ పార్టీల్లో నూతనోత్తేజం 

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని డివిజన్ల పునర్విభజనతో రాజకీయ పార్టీలో నూతనోత్తేజం కనిపిస్తుంది. సుమారు 40 వేల జనాభాకు ఒక డివిజన్ ఏర్పాటు చేస్తుండడంతో కొత్తవారికి రాజకీయ రంగ ప్రవేశం లభిస్తుంది. పాలన వికేంద్రీకరణ కావడంతో ప్రజలకు మౌలిక, కనీస సౌకర్యాలు, వసతులు అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు కొత్తగా రాజకీయ అవకాశాలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. 

ప్రజలకు మౌలిక సదుపాయాలు పెరుగుతాయి ..

గ్రేటర్ హైదరాబాద్ విస్తరణతో నగర పరిధిలో చేరిన కొత్త ప్రాంతాల్లో అభివృద్ధి మరింత వేగం కానున్నది. రోడ్లు, డ్రైనేజ్, స్ట్రీట్ లైటింగ్, పార్కులు, శానిటేషన్ తదితర మౌలిక వసతుల ఏర్పాటు వేగవంతం అవుతుందని ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ రెడ్డి  తెలిపారు. పాలన చేరువ కావడంతో ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని చెప్పారు.

రోడ్లు, డ్రైనేజ్ మౌలిక వసతులు రావడంతో శుభ్రత, వ్యర్థ నిర్వహణలో మెరుగైన సేవలు ప్రజలకు వస్తాయని తెలిపారు. రవాణా, కనెక్టివిటీ విస్తరణ కావడంతో పెట్టుబడులు పెరిగి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

- ప్రవీణ్ రెడ్డి, ఎల్బీనగర్ కాంగ్రెస్ నాయకుడు