12-12-2025 12:00:00 AM
మలక్‌పేట, డిసెంబర్ 1౧ (విజయక్రాం తి): బాల్కనీ తలుపులు పగలగొట్టి చొరబడి అల్మారాలోని రూ.40లక్షలు, 15 తులాల బంగారం, దొంగలించిన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.... మలక్‌పేట లోని ప్రొఫెసర్స్ కాలనీలోని మానస అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న మంత్రవాది వెంకటరమణ నెల రోజుల క్రితం టూర్ నిమిత్తం వివిధ రాష్ట్రాలకు వెళ్లారు.
బుధవారం ఇంటికి చేరుకున్న వెంకటరమణకు బాల్కనీలోని తలుపులు బద్దలు కొట్టి ఉం డటం కనిపించాయి. బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు క్లూస్ టీం వేలిముద్రలు, వివిధ కీలక ఆధారాలను సేకరిం చారు. మలక్‌పేట పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.