calender_icon.png 5 September, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు బకాయిలను తక్షణమే చెల్లించాలి

05-09-2025 02:02:40 AM

-లేనిపక్షంలో రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మారుస్తాం 

-కొత్తగా 100 బిసి హాస్టల్స్, కాలేజీ లు మంజూరు చేయాలి

-ప్రభుత్వానికి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరిక 

ఖైరతాబాద్, సెప్టెంబర్ 4 (విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 14 లక్షల మంది విద్యార్థుల ఫీజుల బకాయిలు 6000 కోట్లను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలతో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని హెచ్చరించారు.

ఈ మేరకు ముఖ్యమంత్రికి 14 బీసీ సంఘాలు లేఖ రాస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ముఖ్యమైన స్కాలర్ షిప్, ఫీజు బకాయిల స్కీమును ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఈ స్కీము పెట్టిన తర్వాత గ్రామాల్లో వ్యవసాయ కూలీల పిల్లలు, మెడిసన్, ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీలు చదువుతున్నారు, సమాజంలో గుణాత్మకమైన మార్పు తో బాల కార్మిక వ్యవస్థ అరికట్టబడడం జరిగిందని అన్నారు.

ఫీజ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు అష్ట కష్టాల పాలవుతున్నారు. ఈ ఫీజులు కట్టాలని కాలేజీ విద్యార్థులపై యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. కోర్సు పూర్తయిన వారికి యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దానివల్ల ఉద్యోగం వచ్చినవారు గత్యంతరం లేక అప్పులు చేసి ఫీజులు చెల్లించవలసి వస్తుందని అన్నారు.

ఈ పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాల పరిస్థితి కూడా  ఆగమ్య గోచరంగా మారిందని అ న్నారు. అనేక స్కీములకు లక్షల కోట్ల అప్పు తెస్తున్న ప్రభుత్వం లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ పథకం కు ఒక 6000 కోట్లు అప్పు తెస్తే ఎవరు అడ్డుకుంటారని ప్రశ్నించారు.

ఇక బీసీ కాలేజీ హాస్టల్ లో సీట్లు దొరకగా విద్యార్థులు రైల్వేస్టేషన్లో, బస్టాండ్లలో, స్నానాలు చేస్తూ రాత్రి పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అందుకుగాను కొత్తగా 100 బీసీ కాలేజీ, హాస్టల్లు మంజూరు చేయాలని ప్రస్తుతం  ఉన్న సీట్ల కంటే  20% సీట్లు పెంచాలని కోరారు ఈ సమావేశంలో లాల్ కృష్ణ, నీల వెంకటేష్, రాజేందర్, రాజ్ కుమార్, మోడీ రాందేవ్, రేగుల మధుసూదన్ రావు, లింగయ్య యాదవ్, నిఖిల్ పటేల్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.