29-11-2025 12:00:00 AM
కరస్పండెంట్ బిడారి సతీష్
ధర్మపురి,నవంబర్28(విజయక్రాంతి):విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు అలవరచుకోవాలన్నారు శ్రీచైతన్య పాఠశాల కరస్పండెంట్ బిడారి సతీష్ పేర్కొన్నారు. వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు పాఠశాల ఎన్నికలు నిర్వహించారు.ఈ ఎన్నికలలో అబ్బాయిల నుండి నలుగురు గురు పోటీ చేయగా పి.అక్షిత్ కుమార్, అమ్మాయిల నుండి ఎనిమిది మంది పోటీ చేయగా ఎ.వర్షిత లు విజయం సాధించారు.
ఇరువురికి రిటర్నింగ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహించిన మమత విజయం సాధించిన విద్యార్థులకు హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కి పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బిడారి సతీష్ మాట్లాడుతూ ప్రతి పండుగ కు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పిల్లలకు ఎన్నికలపై అవగాహన కల్పించాలని ఎలక్షన్ ను గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో ఈ ఎన్నికలు విష్యర్థులకు ఎంతో ఉపయోగపడుతాయనీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ఎ. జ్యోతి, రాజేష్, సమత, వనజ, ఆండాళ్, రజిత, కళ్యాణి, సంధ్య, మల్లీశ్వరి, రజిత, అంజలి, మంజు భార్గవి, నవ్య, అనూష, సాహితి, శిరీష, కార్తిక, స్వప్న, సువర్ణ, శిరీష, మానస ,అనిత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.