29-11-2025 12:00:00 AM
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్, నవంబరు 28 (విజయ క్రాంతి): మహిళా లోకాన్ని అక్షరాస్యత వైపు నడిపించి మహాత్ముడు జ్యోతిబా పూలే అని తుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, నగర కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో డిసిసి కార్యాలయంతో పాటు నగరంలోని శాతవాహన యూనివర్సిటీ మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ హాజరై ఫూలే చిత్రపటానికి, విగ్రహాలకుపూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గురువుగా, అగ్రకులాల చేత అణిచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, సంఘసంస్కర్తగా తత్వవేత్తగా పూలే చేసిన సేవలు మరువలేనివన్నారు.
ఈ కార్యక్రమాలలో నాయకులు ఎండి తాజ్, శ్రావణ్ నాయక్ బానోతు, మడుపు మోహన్, పత్తి మధు, కర్ర రాజశేఖర్, కల్వల రామ్ చందర్, వెన్నం రజిత రెడ్డి, అహమ్మద్ అలీ, కుర్ర పోచయ్య, వంగల విద్యాసాగర్, తోట అంజయ్య, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, పెద్ది గారి తిరుపతి, రోళ్ళ సతీష్, గంగుల దిలీప్, ఇమ్రాన్, నాగుల సతీష్, కుంబాల రాజ్ కుమార్, వీర దేవేందర్, విక్టర్, హైమద్, రామిడి తిరుపతి, నూనె గోపాల్ రెడ్డి, మంద మహేష్, మాదాసు శ్రీనివాస్, అనరాస్ కుమార్, బాశెట్టి కిషన్, పర్వత మల్లేశం, నూనె గోపాల్ రెడ్డి, సరిల్ల రతన్ రాజ్, మీసా రమాదేవి, దుబ్బ నీరజ, రవీందర్ రెడ్డి, ఉరడిలతా, ఆవారు లత, రాచర్ల పద్మ, స్వప్న శ్రీ,విక్రమ్, బషీరుద్దీన్, సుధాకర్ నాయక్, తదితరులుపాల్గొన్నారు.